ఐసొలేషన్ లో సోనియా
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి కరోనా సోకింది. సోనియాకు కరోనా పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో తేలినట్లు చెబుతున్నారు
కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి కరోనా సోకింది. సోనియాకు కరోనా పాజిటివ్ గా వైద్య పరీక్షల్లో తేలినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పార్టీ క్యాడర్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
సమావేశమైన నేతలకు....
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఇటీవల అనేక మంది కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. వారికి కూడా కరోనా సోకినట్లు చెబుతున్నారు. సోనియా గాంధీతో గత వారం రోజులుగా సమావేశమయిన వారందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.