నైట్ క్లబ్‌లో యువతితో రాహుల్ గాంధీ.! నెట్టింట దుమారం, కాంగ్రెస్‌కి కమలం పార్టీ సాలిడ్ కౌంటర్

ఓ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ నేపాల్ రాజధాని ఖాట్మండు వెళ్లారు. అక్కడ నైట్ క్లబ్‌లో ఫొటోలు వైరల్‌గా మారాయి.

Update: 2022-05-03 07:47 GMT
నైట్ క్లబ్‌లో రాహుల్, చైనా రాయబారిగా చెబుతున్న మహిళ

కాంగ్రెస్ యువనేత, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్‌లో యువతితో కలిసి ఉన్న వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ వీడియోలను నేపాల్‌కి చెందిన భూపేన్ కున్వర్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ యువనేత వీడియోలపై బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. యువనేత రాత్రి పార్టీల్లో మునిగి తేలుతున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

ఐదు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా ఆయన ఖాట్మండు వెళ్లినట్లు తెలుస్తోంది. తన స్నేహితురాలి వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ వెళ్లినట్లు అక్కడి పత్రికలు రాశాయి. సీఎన్‌ఎన్‌లో జర్నలిస్ట్‌గా పనిచేసిన సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన ఖాట్మండు వచ్చారని ఆమె తండ్రి భీమ్ ఉదాస్ చెప్పారు. భీమ్ ఉదాస్ మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా పనిచేశారు. రాహుల్ స్నేహితురాలు సుమ్నిమా వివాహం నియా మార్టిన్ షెర్పాతో మంగళవారం జరగనుంది.

ఆమె వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం విస్టారా ఫ్లైట్‌లో నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన బస చేయనున్న మారియట్ హోటల్‌కి వెళ్లారు. రాత్రి నైట్ క్లబ్‌లో యువతితో రాహుల్ వీడియోలు బయటికొచ్చాయి. అయితే అవి సోమవారం రాత్రి జరిగినవేనా? కాదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒక వీడియోలో ఫోన్ చూస్తున్నట్లు.. మరో వీడియోలో యువతితో సన్నిహితంగా మాట్లాడుతూ రాహుల్ కనిపించారు.

అయితే రాహుల్‌తో ఉన్న యువతి గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను నేపాల్‌లోని చైనా దౌత్య అధికారి హౌ యాంక్ అని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. రాహుల్‌తో పాటు ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై విమర్శలు చేసిన కాంగ్రెస్‌‌కి కమలం పార్టీ సాలిడ్ కౌంటరిస్తోంది. దేశం సంక్షోభంలో ఉంటే ప్రధాని విదేశాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన సెటైర్లకు యువనేత ఫొటోలతో బదులిస్తోంది.



Tags:    

Similar News