ఈడీ దాడులు ఇప్పుడే ఎందుకు?
ఈ నెల 24 నుంచి ఛత్తీస్‌ఘడ్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు జరుగుతున్నాయి
ఈ నెల 24 నుంచి ఛత్తీస్‌ఘడ్ లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు దాడులు చేయడం చర్చనీయాంశమైంది. బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఉదయం నుంచి పథ్నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు. వీరంతా ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సన్నిహితులే కావడం విశేషం.
పక్కదారి పట్టించేందుకే...
బోగ్గులెవీ కింద 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ మాట్లాడుతూ ఈ కుంభకోణం నిధులను ఖైరాఘడ్ ఉప ఎన్నికకు వినియోగించారని ఈడీ అధికారులు ఆరోపించారని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, అదానీ అంశం మెడకు చుట్టుకోవడంతోనే ఈడీ దాడులు చేస్తూ ప్రజల దృష్టిని మరలిస్తున్నారని ఆయన ఆరోపించారు