బ్యాంకులకు వరుస సెలవులు

నేడు అంబేద్కర్ జయంతి సహా.. మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా ఉన్నాయి. మేఘాలయ, హిమాచల్..

Update: 2022-04-14 03:31 GMT

విజయవాడ : బ్యాంక్ వినియోగదారులకు ఈవారం లావాదేవీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. నేడు అంబేద్కర్ జయంత్రి, ఏప్రిల్ 15 గుడ్ ఫ్రై డే సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. తిరిగి శనివారం బ్యాంకులు తెరచుకున్నా.. ఏప్రిల్ 17 ఆదివారం మళ్లీ సెలవు. ఇలా వరుస సెలవులతో బ్యాంక్ కస్టమర్లు కాస్త ఇబ్బందులు పడక తప్పదు.

నేడు అంబేద్కర్ జయంతి సహా.. మహావీర్ జయంతి, వైశాఖి, తమిళనాడు న్యూ ఇయర్, బిజు ఫెస్టివల్ కూడా ఉన్నాయి. మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ 14న బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది. అలాగే ఏప్రిల్ 15న గుడ్ ఫ్రైడేతో పాటు బెంగాలీ న్యూ ఇయర్, హిమాచల్ డే వస్తున్నాయి. రాజస్తాన్, జమ్మూకశ్మీర్, శ్రీనగర్ మినహా ఏప్రిల్ 15న అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూతపడనున్నాయి. అనంతరం ఏప్రిల్ 16న అస్సాంలో బొహగ్ బిహు పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు.


Tags:    

Similar News