వంటింట్లో గ్యాస్ మంట.. గుండె గుభేల్ మనేలా పెరిగిన గ్యాస్ ధరలు

సామాన్యుడి నడ్డి విరిచేలా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్.. ఆఖరికి వంటింట్లో ఉండే గ్యాస్ సిలిండర్ ధరలకూ..

Update: 2022-05-07 06:03 GMT

ముంబై : దేశంలో అన్ని నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి కానీ.. సామాన్యుడి జీతం మాత్రం పెరగడంలేదు. సామాన్యుడి నడ్డి విరిచేలా నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్.. ఆఖరికి వంటింట్లో ఉండే గ్యాస్ సిలిండర్ ధరలకూ రెక్కలొచ్చాయి. ఈ రోజు తెల్లవారుతూనే సామాన్యుడి గుండె గుభేల్ మనిపించేలా ఓ వార్త వచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు చేసిన ప్రకటన అది. ఇటీవలే 19 కిలోల వాణిజ్యసిలిండర్ ధరను పెంచిన చమురు సంస్థలు.. తాజాగా గృహ వినియోగ గ్యాస్ ధరలనూ అమాంతం పెంచేశాయి.

గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 50 పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజాగా పెరిగిన ధరలతో గృహ వినియోగ గ్యాస్ ధర సిలిండర్ ధర రూ.1052కి చేరింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. ఇటీవలే పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,460 నుంచి రూ. 2,563.50కి చేరుకుంది.


Tags:    

Similar News