రాహుల్ గాంధీపై కేసు నమోదు

భారత్ జోడో యాత్ర సందర్భంగా.. రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించిన వీడియోలకు బ్యాక్ గ్రౌండ్ లో కేజీఎఫ్‌-2 హిందీ..;

Update: 2022-11-05 11:32 GMT
case files on rahul gandhi, bharat jodoyatra, kgf 2 hindi songs

case files on rahul gandhi

  • whatsapp icon

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో ఉన్నారు. యాత్రలో ఉన్న రాహుల్ గాంధీపై కాపీ రైట్ కేసు నమోదైంది. బెంగళూరు పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై కేసు నమోదు చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్‌-2 హిందీ వర్షన్‌ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై కేసు పెట్టింది.

భారత్ జోడో యాత్ర సందర్భంగా.. రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించిన వీడియోలకు బ్యాక్ గ్రౌండ్ లో కేజీఎఫ్‌-2 హిందీ వర్షన్ సినిమా పాటలు, సంగీతాన్ని వాడారు. దీనిపై ఆ సినిమా మ్యూజిక్ హక్కులను సొంతం చేసుకున్న బెంగళూరుకు చెందిన ఎమ్‌ఆర్‌టీ సంస్థ కాపీ రైట్ ఉల్లంఘన కింద రాహుల్‌ గాంధీ, సుప్రియా శ్రీనాథ్‌, జైరామ్‌ రమేశ్‌పై కేసు పెట్టింది. కేజీఎఫ్‌-2 హక్కుల కోసం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశామని, కానీ తమ అనుమతి లేకుండానే కాంగ్రెస్ ఆ పాటల్ని వాడుకుందని సదరు సంస్థ ఆరోపించింది. ఇది కాపీరైట్ ఉల్లంఘనేనని ఆ సంస్థ ఆరోపించింది.






Tags:    

Similar News