నిర్లక్ష్యం వద్దు.. తస్మాత్ జాగ్రత్త
కరోనా కేసులు భారత్ లో తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యం చేయవద్దని, కోవిడ్ నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
భారత్ లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదువేలకు మించి తక్కువ కేసులు నమోదు కావడం శుభపరిణామం. ఒక్కరోజులో 4,129 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 20 మంది దేశ వ్యాప్తంగా మరణించారు. ఒక్కరోజులోనే 4,688 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కేసుల రికవరీ రేటు 98.72 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.10 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.
కేసులు తగ్గుతున్నా...
దేశంలో ఇప్పటి వరకూ 4,45,72,243 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,40,00,298 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో 5,28,530 మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 43,415 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,17,68,35,714 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా కేసులు భారత్ లో తగ్గుతున్నప్పటికీ నిర్లక్ష్యం చేయవద్దని, కోవిడ్ నిబంధనలను పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటివి చేయాలని కోరుతున్నారు.