భారత్ లో భారీగా కరోనా కేసులు.. ఒమిక్రాన్ కూడా?
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 16,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈరోజు కొత్తగా 16,764 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 220 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,42,45,945 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 91,361 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
పెరుగుతున్న యాక్టివ్ కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 3,53,36,049 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,81,220 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,44,73,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.
ఒమిక్రాన్ కేసులు....
కాగా ఒమిక్రాన్ కేసులు కూడా భారత్ లో పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.