కరోనాపై ఊరట కల్గించే న్యూస్

కరోనా కేసులు దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా కేరళలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి.;

Update: 2022-02-07 02:38 GMT

కరోనా కేసులు దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధానంగా కేరళలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా నమోదయిన కేసులు కేరళలోనే. మహారాష్ట్రలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా కేరళలో మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నైట్ కర్ఫ్యూ కొన్నాళ్లు విధించింది. వీకెండ్ కర్ఫ్యూ లను కూడా అమలు చేసింది. అయతే ఇప్పుడిప్పుడే కేరళలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది.

కేరళలో....
ప్రస్తుతం రోజూ 26 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొన్నటి వరకూ కరోనా కేసులు యాభై వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు సగానికి సగం తగ్గాయి. ప్రస్తుతం కేరళలో యాక్టివ్ కేసులు మూడు లక్షలకు పైగానే ఉన్నాయి. అయితే కేసులు తగ్గుతుండటంతో యాక్టివ్ కేసులు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. కోవిడ్ నిబంధనలు మాత్రం పాటించాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News