భారత్ ను బెంబేలెత్తిస్తున్న కరోనా, ఒమిక్రాన్.. ఈఒక్కరోజే
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 1,79,723 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
భారత్ లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈరోజు కొత్తగా 1,79,723 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 146 మంది మరణించారు. మరణాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 3,53,22, 882 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఏడు లక్షలు దాటిన...
ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 3,62,18,358 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,83,742 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 1,51,94,76,774 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది
ఒమిక్రాన్ కేసులు....
భారత్ లో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,552 మంది కోలుకున్నారు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,216, రాజస్థాన్ లో 529, ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, కేరళలో 333 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.