21న భారత్ లో కరోనా కేసులు ఎన్నంటే?
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఐదు వేలలోపే రెండు రోజుల నుంచి కరోనా కేసులు నమోదు కావడం శుభపరిణామం.
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఐదు వేలలోపే రెండు రోజుల నుంచి కరోనా కేసులు నమోదు కావడం శుభపరిణామం. అయితే కేసులు తగ్గుతున్నాయని అజాగ్రత్త వద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఒక్కరోజులో 4,510 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా 33 మంది భారత్ లో మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివిటీ రేటు 98.71 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు.
యాక్టివ్ కేసులు....
భారత్ లో ఇప్పటి వరకూ 4,45,47,599 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,72,980 కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో కరోనా కారణంగా 5,28,403 మరణించారు. ప్రస్తుతం దేశంలో 46,216 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 2,16,95,51,591 కోట్ల డోసులు వేసినట్లు అధికారులు వెల్లడించారు.