30వేలకు లోపు యాక్టివ్ కేసులు
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. మూడు వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజులోనే 2,756 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్కరోజులో 21 మంది మరణించారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ మరణాల్లో ఎక్కువగా కేరళలోనే సంభవించాయి. కేరళలో 16 మంది కరోనాతో మరణించారు. కరోనా పాజిటివిటీ రేటు 1.15 శాతంగా నమోయింది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదయిందని అధికారులు తెలిపారు.
వ్యాక్సినేషన్....
దేశంలో ఇప్పటి వరకూ 4,46,12,013 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా నుంచి 4,40,54,621 కోట్ల మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకూ 5,28,799 మంది కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో 28,593 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 2,18,97,88,104 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.