యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయ్
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. పెరుగుతున్నాయి. ఒకరోజు పెరిగితే మరొక రోజు కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుంది.
భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. పెరుగుతున్నాయి. ఒకరోజు పెరిగితే మరొక రోజు కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తుంది. తాజాగా ఒక్కరోజులో 4,858 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 18 మంది కరోనా కారణంగా మరణించారు. వీరిలో 4,735 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా నమోదు కాగా, యాక్టివ్ కేసుల శాతం మాత్రం 0.11 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.
మరణాల సంఖ్య...
దేశంలో ఇప్పటి వరకూ 4,45,39,046 మంది కరోనా బారిన పడ్డారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 4,39,62,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,28,355 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 48,027 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ 2,16,70,14,127 కరోనా వ్యాక్సిన్ డోసుల ను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.