కరోనా ముగింపు దశకు వచ్చిందా?
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ఒక్కరోజులోనే 6,422 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 34 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులో 5,748 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. ఇక యాక్టివ్ కేసుల శాతం 0.10కి పడిపోయింది. కోవిడ్ ముగింపు దశకు వచ్చిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతోంది.
పెరుగుతున్న కేసులు...
భారత్ లో ఇప్పటి వరకూ 4,45,16,479 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,41,840 మంది కరోనాకు చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా ప్రారంభమయిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆ వ్యాధితో 5,28,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 46,389 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 215.98 కోట్లకు చేరింది.