Corona Virus : కేసులు పెరుగుతున్నాయ్.. అలర్ట్‌గా లేకుంటే ఇక అంతే!
కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది
కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. గడచిన 24 గంటల్లో 636 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడంచారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో ప్రస్తుతం 4,394 కు చేరుకుంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మరణించడం కూడా ఆందోళనకు మరొక కారణం.
ఈ రెండు రాష్ట్రాల్లో....
ఇప్పటి వరకూ కరోనాతో భారత్ 5,33,364 మంది మరణించారు. అయితే ఇదే సమయంలో కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుండటం కొంత ఊరట కలిగించే అంశమే. రికవరీ శాతం 98.81 శాతంగా నమోదయింది. జెఎన్ 1 వేరియంట్ కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. దేశంలో ఈ తరహా వేరియంట్ కేసులు 47కు చేరుకోవడంతో వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో జెఎన్ 1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ తరహా కేసులు అత్యధికంగా గోవాలో నమోదయ్యాయి. గోవాలో 78, కేరళలో 41 కేసులు నమోదయ్యాయి.