కేసులు తగ్గాయ్.. నిర్లక్ష్యం వద్దు
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఒక్కరోజులోనే 5,554 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 18 మంది కరోనా కారణంగా మరణించారు
భారత్ లో కరోనా కేసులు కొంత తగ్గాయి. ఒక్కరోజులోనే 5,554 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 18 మంది కరోనా కారణంగా మరణించారు. ఒక్కరోజులోనే 6,322 మంది కరోనా వైరస్ కు చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 98.7 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.11 శాతంగా నమోదయింది. కరోనా కేసులు తగ్గుతున్నాయని నిర్లక్ష్యం వహించవద్దని ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4,44,90,283 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,`3,294 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 5,28,139 మంది మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 48,850 ఉన్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా జరగుతుంది. ఇప్పటి వరకూ 214.77 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.