భారత్ లో మళ్లీ పెరిగిన కేసులు

భారత్ లో కొద్ది రోజుల తర్వాత కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒక్కరోజులో 5,108 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

Update: 2022-09-14 03:52 GMT

భారత్ లో కొద్ది రోజుల తర్వాత కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఒక్కరోజులో 5,108 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 31 మంది కరోనా కారణంగా చనిపోయారు. ఒక్కరోజులో 5,675 మంది భక్తులు కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయింది. ఇక యాక్టివ్ కేసుల శాతం తగ్గింది. ప్రస్తుతం 0.10 శాతంగా నమోదయింది.

తగ్గుతున్న యాక్టివ్ కేసులు...
దేశంలో ఇప్పటి వరకూ 4,45,10,057 కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 4,39,36,092 మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకూ దేశంలో 5,28,216 మంది కరోనా కారణంగా మరణించారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 45,749 యాక్టివ్ కేసులున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 215.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News