కరోనా తగ్గిందోచ్... కేసుల సంఖ్య
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. చాలా రోజుల తర్వాత మూడు వేల కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కరోనా కేసులు బాగా తగ్గాయి. చాలా రోజుల తర్వాత మూడు వేల కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లేనని నిపుణులు సయితం భావిస్తున్నారు. అయినా కోవిడ్ నిబంధనలను మాత్రం పాటించాల్సిందేనని చెబుతున్నారు. ఒక్కరోజులో 3,011 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే పరీక్షల సంఖ్య తగ్గింది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో 1,34, 848 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించారు. రికవరీ రేటు 98.73 శాతానికి పెరగడం సంతోషించదగ్గ విషయం.
దేశ వ్యాప్తంగా....
ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 2.40 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ 5,28,701 మంది కరోనా కారణంగా మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 36,126కు చేరుకుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 218.77 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.