యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయ్
భారత్ లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా మళ్లీ పెరిగాయి. దసరా పండగ తర్వాత కేసుల సంఖ్య కొంత పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి
భారత్ లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా మళ్లీ పెరిగాయి. దసరా పండగ తర్వాత కేసుల సంఖ్య కొంత పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్కరోజులో 91,458 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 2,424 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు శాతం 98.75 శాతంగా నమోదయింది. యాక్టివ్ కేసుల శాతం 0.06 శాతంగా నమోదయిందని అధికారులు వెల్లడించారు.
మరణాల సంఖ్య...
ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 4.46 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడగా, అందులో 4.40 కోట్ల మంది కరోనా చికిత్స పొంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 5,28,814 మంది మరణించారని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 28,079 యాక్టివ్ కేసులున్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,18,99,72,644 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.