కరోనా అలర్ట్... పెరిగిన కేసులు

దేశంలో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఒక్కరోజులో 7,946 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.

Update: 2022-09-01 04:33 GMT

దేశంలో కరోనా కేసులు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. ఒక్కరోజులో 7,946 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 37 మంది కరోనా కారణంగా మరణించారు. అయితే ఒక్కరోజులోనే 9,828 మంది చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల శాతం 0.15 శాతానికి తగ్గింది. దీంతో పాటు కరోనా రికవరీ రేటు శాతం 98.67 శాతానికి పెరగడం కొంత ఊరట కల్గించే అంశం.

హోం ఐసొలేషన్ లోనే....
కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంది. హోం ఐసొలేషన్ లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని వైద్య నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో 4,44,16,078 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారిలో 4,38,45,680 కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 5,27,911 మరణించారు. ప్రస్తుతం దేశంలో 62,748 యాక్టివ్ కేసులున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని, ఇప్పటి వరకూ 2,12,52,83,259 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News