నాలుగు వేలకు దిగువన కేసులు

దేశంలో కరోనా కేసులు బాగా తగ్గాయి. నాలుగు వేలకు దిగువన కేసులు నమోదవ్వడం ఆనందించదగ్గ విషయం

Update: 2022-09-28 07:21 GMT

దేశంలో కరోనా కేసులు బాగా తగ్గాయి. నాలుగు వేలకు దిగువన కేసులు నమోదవ్వడం ఆనందించదగ్గ విషయం. ఒక్కరోజులోనే 3,615 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 4,972 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పాజిటివిటీ రేటు దేశ వ్యాప్తంగా 1.12 శాతంగా నమోదయింది. రికవరీ రేటు శాతం 98.72 శాతంగా ఉంది.

జూన్ నెల స్థాయికి...
గత జూన్ నెలలో ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకూ 4.45 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,28,584 మంది మరణించారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసులు 40,970 ఉన్నాయి. ఇప్పటి వరకూ 217.9 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News