మళ్లీ ఊపుతున్న కరోనా... సర్కార్ హై అలర్ట్
మహారాష్ట్రను మళ్లీ కరోనా ఒక ఊపు ఊపుతుంది. నిన్న ఒక్కసారిగా కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
మహారాష్ట్రను మళ్లీ కరోనా ఒక ఊపు ఊపుతుంది. నిన్న ఒక్కసారిగా కేసులు పెరగడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిన్న ఒక్కరోజు మహారాష్ట్రలో 1,081 కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు నెలల నుంచి అత్యల్పంగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కల్గిస్తుంది.
మూడు నగరాల్లోనే....
మహారాష్ట్రలో కరోనా ఎక్కువగా ముంబయి, పూనే, ఠాణే నగరాల్లోనే ఎక్కవుగా విస్తరిస్తుంది. ఈ మూడు ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటికి మహారాష్ట్రలో 3,475 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో సుమారు 2,500 కరోనా కేసులు ముంబయి ప్రాంతంలో నమోదయినవే. ఎవరూ ఆసుపత్రిలో చేరేంత సీరియస్ గా లేదని, ఇంటిలోనే ఉంటూ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని, ప్రజలు ఎవరూ భయాందోళనలు చెందవద్దని ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు.