Kejrival : కేజ్రీవాల్ కు దక్కని ఊరట.. మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది.

Update: 2024-08-08 12:33 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కు సీబీఐ కేసులో కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణకు హాజరుపరిచారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో...
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేయగా, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం సీబీఐ కేసులో జైలులో ఉన్నారు.


Tags:    

Similar News