16 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం

ఇప్పటివరకూ పెద్దలకు, 15-18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ జరిగింది. తాజాగా 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లకు కూడా వ్యాక్సిన్ల..

Update: 2022-03-14 11:18 GMT

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ బారి నుంచి రక్షణ కోసం మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ పెద్దలకు, 15-18 ఏళ్ల వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ జరిగింది. తాజాగా 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లకు కూడా వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రంగం సిద్ధం చేసింది. మార్చి 16వ తేదీ నుంచి 12-14 ఏళ్ల వయసులోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దాని ప్రకారం.. 12-14 ఏళ్ల మధ్య పిల్లలతో పాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్‌ డోసు (బూస్టర్ డోసు) మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మాన్షుక్‌ మాండవీయా ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇప్పటి వరకూ దేశంలో 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు.




Tags:    

Similar News