ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత
దేశరాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఉగాండాకు
మత్తు పదార్థాల స్మగ్లింగ్ పై ఇటు పోలీసులు, అటు కస్టమ్స్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఉగాండాకు చెందిన మహిళ ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. ఆమె వెంట తీసుకొచ్చిన లగేజి బ్యాగును.. ఒకటికి రెండుసార్లు తనిఖీ చేశారు.
అధికారుల తనిఖీలో బట్టల మధ్యలో పెట్టి ఉన్న 107 క్యాప్సల్స్ లభ్యమయ్యాయి. ఆ క్యాప్సల్స్ లో హెరాయిన్ ను నింపి తరలిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకుని, ఎన్ డీసీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు అధికారులు. సీజ్ చేసిన హెరాయిన్ బరువు 1060 గ్రాములు ఉన్నట్లు దాని విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.