Breaking : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు

Update: 2024-03-23 12:31 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటీషన్ వేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును అరవింద్ కేజ్రీవాల్ తరుపున న్యాయవాదులు కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొన్న రాత్రి అరెస్ట్ చేశారు.

అరెస్ట్‌ను సవాల్ చేస్తూ...
ఆయనకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ముఖ్యమంత్రి పదవికి కూడా కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. దీంతో ఆయన తన అరెస్ట్ అక్రమమంటూ ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News