నేడు సీబీఐ విచారణకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారుల ఎదుటకు విచారణకు హాజరవుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారుల ఎదుటకు విచారణకు హాజరవుతున్నారు. సీబీఐ అధికారులు ఇప్పటికే ఆయనకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చింది. మద్యం పాలసీపై అరవింద్ కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుతో పెద్దయెత్తున ముడుపులు మారాయన్న ఆరోపణలతో ఇప్పటకే అనేక మందిని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
దేశంలోనే తొలిసారిగా...
అయితే దేశంలోనే ఒక ముఖ్యమంత్రిని సీబీఐ విచారణకు పిలవడం ఇదే తొలిసారి. ఇది రాజకీయ కుట్ర కేసుగా అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణిస్తున్నారు. తాను విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు. తాను వెళ్లకపోతే తాను తప్పు చేసినట్లే అవుతుందని కేజ్రీవాల్ తెలిపారు. కేజ్రీవాల్ సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానుండటంతో ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కేజ్రీవాల్ నివాసం వద్ద పెద్దయెత్తున పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ నివాసం వైపు ఎవరకూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు.