కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ కొట్టవేస్తూ.. పిటీషన్ వేసిన వారికి జరిమానా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

Update: 2024-04-22 12:12 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భద్రతను దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ పిటీషన్ వేసిన న్యాయ విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.75వేల రూపాయల మేరకు జరిమానా కూడా విధించింది.

తీహార్ జైలులో ఉన్న...
అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించిన అనంతరం తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్‌ తీహార్ జైలులో ఉన్నారు. అయితే ఆయనపై హత్యాయత్నంచేస్తున్నారంటూ వేసిన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టేసింది.


Tags:    

Similar News