భారత్ లో తగ్గిన కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 1247 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అంతకుముందురోజు 2,183 కేసులు..
న్యూఢిల్లీ : భారత్ లో రోజువారి కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నారు. ఒకరోజు ఎక్కువగా.. మరుసటి రోజు తక్కువ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 1247 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అంతకుముందురోజు 2,183 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 43 శాతం తగ్గుదల కనిపించింది. మరోవైపు దేశం మొత్తంమీద ఒక కరోనా మరణం మాత్రమే సంభవించింది.
ఇదే సమయంలో 928 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,860 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ దేశంలో 186 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేశారు. మరోవైపు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా 500కు పైగా కేసులు నమోదయ్యాయి.