Sabarimala : శబరిమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి ఎంత సమయం అంటే?

శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు

Update: 2024-01-10 03:58 GMT

శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. జ్యోతి దర్శనానికి ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భావించి చాలా మంది ఇప్పటికే శబరిమల చేరుకుని స్వామి వారికి ఇరుముడులు సమర్పించుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వారిని క్రమపద్ధతిలో స్వామి వారి దర్శనానికి పంపడానికి ఆలయ సిబ్బందికి, పోలీసులకు కష్టంగా మారింది.

వాహనాల రద్దీతో...
మళ్లీ అనేక చోట్ల వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పంబ నుంచి భక్తులు కాలినడకన అయ్యప్పను చేరుకుంటుండటంతో వారికి అదుపు చేయడం కూడా కష్టంగా మారింది. కేరళ హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకున్నప్పటికీ పెద్దగా ఫలితం లేదని భక్తులు వాపోతున్నారు. ప్రస్తుతం శబమరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది. ఈ నెల సంక్రాంతి రోజున జ్యోతి దర్శనం ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశముంది.


Tags:    

Similar News