అరవణ ప్రసాదం నిలిపివేత
అయ్యప్ప ప్రసాదంలో వాడే యాలకుల్లో పురుగుల మందు అవశేషాలున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడంతో పంపిణీని నిలపివేశారు
అయ్యప్ప స్వామి దర్శనంతో పాటు ప్రసాదం కూడా అనేక మంది ఇష్టపడతారు. అరవణం ప్రసాదం అందరూ ఇష్టంగా భక్తిశ్రద్ధలతో తింటారు. అయితే ప్రసాదంలో వాడే యాలకుల్లో పురుగుల మందు అవశేషాలున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడంతో ప్రసాదం పంపిణీని నిలపివేశారు. ప్రసాదంలో వాడిన యాలకుల్లో 14 రకాల హానికారిక అవశేషాలున్నాయని అధికారులు కూడా గుర్తించారు.
పురుగు మందు అవశేషాలు...
ఈ మేరకు తమ రిపోర్టులో అధికారులు నివేదిక ఇవ్వడంతో ప్రసాదం పంపిణీని అధికారులు నిలిపేశారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రసాదం నిలిపేసిన ఆలయ దేవస్థాన కమిటీ అప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉంచిన ఆరు లక్షల డబ్బాలను ధ్వంసం చేసింది. ఇక నుంచి యాలకులు లేని ప్రసాదాన్ని పంపిణీ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో రెండుమూడు రోజుల్లో మకర దర్శనానికి వచ్చే భక్తులకు ప్రసాదం పంపిణీ ఇబ్బందిగా మారనుంది. అందుకోసం యాలకులు లేని అరవణ ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికమీద కసరత్తులు చేస్తున్నారు.