చిన్నారుల వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్
చిన్నారుల వ్యాక్సినేషన్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.
చిన్నారుల వ్యాక్సినేషన్ కు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకూ పెద్ద వాళ్లకే కోవిడ్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చింది. కరోనా సమయంలో కొందరు పిల్లలు కూడా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పిల్లలకు వ్యాక్సినేషన్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. చివరకు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పిల్లల వ్యాక్సిన్ కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
పన్నెండేళ్లు....
పన్నెండేళ్లు పైబడిన వారికి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవో వాక్స్ టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఇది శుభవార్త అని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. పన్నెండు ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు ఉన్నవారికి ఈ టీకాను ఇవ్వవచ్చని, గ్లోబల్ ట్రయల్స్ లోనూ కోవో వాక్స్ ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆ సంస్థ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.