గొడవపడి పుట్టింటికెళ్లిన భార్య.. హై టెన్షన్ వైర్లను కొరికేసిన భర్త

చిన్నమంగోడు ప్రాంతానికి చెందిన ధర్మదురై(33)కి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింట్లోనే..;

Update: 2023-04-06 08:16 GMT
electric high tension wires

electric high tension wires

  • whatsapp icon

భార్య -భర్తల మధ్య గొడవలు సహజం. ఒక్కోసారి గొడవలు పెద్దవైతే భార్య భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లడమూ సహజం. ఆమె బ్రతిమిలాడో.. నచ్చజెప్పో కాపురానికి తీసుకురావలసిన బాధ్యత భర్తది. కానీ ఓ భర్త.. తనపై అలిగి వెళ్లిపోయిన భార్యను వెనక్కు రప్పించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. వాళ్ల కాస్త వెయిట్ చేయాలని చెప్పడంతో.. ఆ వ్యక్తి హై టెన్షన్ విద్యుత్ వైర్ ను కొరికేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. చిన్నమంగోడు ప్రాంతానికి చెందిన ధర్మదురై(33)కి భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో ధర్మదురై ఇటీవల తన బావమరుదులపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అతను మద్యంమత్తులో ఉండటంతో పోలీసులు అతడిని వెయిటింగ్ రూమ్ లో వేచి ఉండాలని సూచించారు. కొద్దిసేపు వెయిటింగ్ రూమ్ లోనే ఉన్న ధర్మదురై..అకస్మాత్తుగా బయటకు వెళ్లి సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కాడు. చుట్టుపక్కల వారు ఎంతవారిస్తున్నా వినిపించుకోకుండా.. హై టెన్షన్ వైర్ ను నోటితో కొరికేశాడు. తీవ్రగాయాలపాలైన ధర్మదురైను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.



Tags:    

Similar News