అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.0గా నమోదయింది.

Update: 2023-03-06 06:47 GMT

భూకంపాలు ప్రజలను భయపెడుతున్నాయి. టర్కీ, సిరియా భూకంపాల తీవ్రత తర్వాత ఏ మాత్రం భూప్రకంపనలు చోటు చేసుకున్నా ప్రజలు భయపడిపోతున్నారు. వరసగా భూ ప్రకంపనలు జరుగుతుండటం కూడా ప్రజల్లో ఆందోళనను మరింత ఎక్కువ చేస్తుంది. ఈరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.0గా నమోదయింది.

ప్రాణ, ఆస్తి నష్టం...
ఈ విషయాన్ని నేషనల్ సెంట్ ఫర్ సిస్మోలాజీ ధృవీకరించింది. కొద్ది సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. నికోబార్ దీవుల్లోని పెర్కాకు 208 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇండోనేషియోలో కూడా భూకంపం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News