Earth Quake : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. తీవ్రత ఏ స్థాయిలో అంటే?
జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5.5 గా నమోదయింది
జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5.5 గా నమోదయింది. ఉత్తర కాశ్మీర్ లో భూకంప కేంద్రం ఉందని సెంటర్ ఆఫ్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమికి పది కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు లడఖ్ లోనూ ఈ భూకంపం సంభవించింది.
ఆస్తినష్టం మాత్రం...
ఈ భూకంప తీవ్రతకు భయపడి ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా ఎంత మేర ఆస్తినష్టం జరిగిందన్నది తెలియరాలేదు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు.