పంజాబ్ లో 4.1 తీవ్రతతో భూకంపం..
బుధ, శనివారాల్లో ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో భూమి కంపించింది. నవంబర్ 9న ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో, నవంబర్ 10న..
ఉత్తర భారతదేశం వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. సోమవారం తెల్లవారుజామున పంజాబ్ లో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. వారం రోజుల్లో ఉత్తరభారతంలో భూకంపం రావడం ఇది మూడోసారి. అమృత్ సర్ సమీపంలో తెల్లవారు జామున 3 గంటల 40 నిమిషాలకు సుమారు 120 కిలోమీటర్ల మేర భూమి కంపించిందని సమాచారం.
బుధ, శనివారాల్లో ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో భూమి కంపించింది. నవంబర్ 9న ఢిల్లీ, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో, నవంబర్ 10న ఉత్తర భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. కాగా.. తక్కువ తీవ్రతతో వస్తున్న భూ ప్రకంపనల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు.