Loksabha Speaker : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నేడు
యాభై ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. నేడు జరిగే ఈ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.;
యాభై ఏళ్ల తర్వాత లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. నేడు జరిగే ఈ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే కూటమి అభ్యర్ధిగా ఓం బిర్లా, ఇండియా కూటమి అభ్యర్థిగా కె. సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు. నేడు జరిగే ఎన్నికలో స్పీకర్ ఎంపిక జరుగుతుంది. భారత దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అధికార, విపక్షాల మధ్య స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల పై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమయింది.
బలాబలాలు...
ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో లోక్‌సభలో నేడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్డీఏకు 293 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరికి వైసీపీ సభ్యులు నలుగురు మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 297కు పెరిగింది. ఇండియా కూటమికి 233 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉంది. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకపక్షంగానే జరిగే అవకాశాలున్నాయి. తమకు సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడంతోనే పోటీకి దిగామని విపక్షాలు చెబుతున్నాయి.