పంజాబ్ ఎన్నిక వాయిదా.. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం
పంజాబ్ ఎన్నికను కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన ఎన్నికను 20వ తేదీకి వాయిదా వేసింది
పంజాబ్ ఎన్నికను కేంద్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన ఎన్నికను 20వ తేదీకి వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేసింది. తేదీలను కూడా ఖరారు చేసింది. పంజాబ్ తో పాటు ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలకు కూడా షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.
ఇరవై తేదీకి....
అయితే ఫిబ్రవరి 14వ తేదీన గురు రవిదాస్ జయంతి ఉంది. ఈ తేదీని చూసుకోకుండానే ఎన్నికల కమిషన్ తేదీని ప్రకటించింది. అయితే పంజాబ్ ముఖ్యమంత్రితో పాటు పలు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరాయి. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ వచ్చే నెల 14న జరగాల్సిన ఎన్నికను 20వ తేదీకి వాయిదా వేసింది.