పంజాబ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్‌స్టర్ ల మృతి
పంజాబ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ లు మృతి చెందారు.
పంజాబ్ లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ లు మృతి చెందారు. సిద్దూ మూసేవాల హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు పంజాబ్ అమృత్ సర్ సమీపంలోని చిచా భక్నా గ్రామంలో సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితులు ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు.
పోలీసులపై...
అయితే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. మృతి చెందిన వారిలో జగన్‌రూప్ సింగ్ రూపా, మన్‌ప్రీత్ సింగ్ గా గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్ లో ముగ్గురు పోలీసులకు గాయాల పాలయ్యారని పోలీసులు తెలిపారు. మృతదేహాల వద్ద ఏకే 47 తో పాటు ఒక పిస్టల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.