Breaking : స్పీడ్ పెంచిన ఈడీ ...751 కోట్ల ఆస్తుల జప్తు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఆస్తును జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబయి, లక్నోలలో అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 751,9 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం తీసుకుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం...
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ తో పాటు దానిని నిర్వహిస్తున్న యంగ్ ఇండియన్ ప్రవేట్ లిమిటెడ్ కు కూడా తాత్కాలకి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, ముంబయి, లక్నో నగరాల్లో 661 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో సోనియా, రాహుల్ ను ఈడీ విచారించిన నేపథ్యంలో తాజాగా ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది.