Dilhi Liqour Scam : మరొక నేతకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేలాశ్ గెహ్లాత్ కు నోటీసులిచ్చింది

Update: 2024-03-30 05:59 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను మరింత వేగం పెంచింది. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా మరో మంత్రికి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా ఉన్న కైలాశ్ గహ్లాత్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈరోజు హాజరు కావాలని...
ఈరోజు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాము విచారణ జరపాల్సి ఉన్నందున వెంటనే విచారణకు రావాలని వారు కోరారు. ఇప్పటికే ఈడీ కస్టడీలో అరవింద్ కేజ్రీవాల్ ఉండటంతో ఇద్దరినీ కలిపి విచారించే అవకాశముందని తెలుస్తోంది. మరి ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది కాసేపట్లో తెలియనుంది.


Tags:    

Similar News