మరణాలు తగ్గినా.. ముప్పు మాత్రం?
మరణాల సంఖ్య కొంత తగ్గినా ఇంకా ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.
భారత్ లో కరోనా కేసులు సంఖ్య నేడు తగ్గాయి. ఈరోజు భారత్ లో 4,043 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది కరోనా కారణంగా చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.71 శాతంగా నమోదయిందని అధికారులు వెల్లడించారు. యాక్టివ్ కేసుల శాతం 0.11 శాతంగా నమోదయింది. మరణాల సంఖ్య కొంత తగ్గినా ఇంకా ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటించాలని అధికారులు కోరుతున్నారు.
వ్యాక్సినేషన్...
దేశంలో ఇప్పటి వరకూ 4,45,43,089 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 4,39,67,340 కరోనా చికిత్స పొంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. భారత్ లో ఇప్పటి వరకూ 5,28,370 కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 47,379 గా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 2,16,83,24,537 కరోనా వ్యాక్సిన్ డోసులు అందించామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.