బంగారం ధరలకు బ్రేక్

ఈరోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి.

Update: 2023-03-07 03:53 GMT

పసిడిప్రియులు బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తుంటారు. బంగారం ధరలు తగ్గకపోయినా సరే స్థిరంగా కొనసాగితే చాలు అనే పరిస్థితికి వచ్చారు. వరసగా గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో మదుపరులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా పెట్టుబడి కోసం బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ధరలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కేంద్ర బ్యాంకుల్లో బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, రూపాయి బలపడటం కోసం బంగారం దిగుమతులను తగ్గించడం వంటి కారణాలతో గత కొంత కాలంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పేదలకు బంగారం కొనడం భారంగా మారింది.

పెరిగిన వెండి...
అయితే గత రెండు రోజులుగా బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈరోజు కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండిపై వంద రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 51,850 రూపాయలుగా కొనసాగుతుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 56,550 రూపాయలు పలుకుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర ప్రస్తుతం 70,600 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News