ఎమర్జెన్సీ మెసేజ్.. అలర్ట్
ప్రతి మొబైల్ కు కొద్దిసేపటి క్రితం మొబైల్ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఇది చూసి ఫోన్ వినియోగదారులు కంగారు పడ్డారు
ప్రతి మొబైల్ కు కొద్దిసేపటి క్రితం మొబైల్ ఎమర్జెన్సీ మెసేజ్ వచ్చింది. ఇది చూసి ఫోన్ వినియోగదారులు కంగారు పడ్డారు. అయితే ఇది కంగారు పడాల్సిన పని లేదని, దేశ వ్యాప్తంగా మొబైల్ ఫోన్‌లకు ఈ ఎమర్జెన్సీ అలారం రావడం వెనక కేంద్ర ప్రభుత్వమే కారణం. భారత టెలికమ్యునికేషన్ శాఖ ద్వారా నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీతో చేసిందని పేర్కొంది. ఓకే బటన్ ప్రెస్ చేసేంత వరకూ అలారం మోగుతుండటంతో కొంత భయాందోళనలకు గురయ్యారు.
టెస్టింగ్ టైం...
ఇది ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరిగిందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విపత్తుల సమయంలో దేశ భద్రత దృష్ట్యా ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ అలర్ట్ ట్రయల్ రన్ చేశారని భారత ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇది టెస్టింగ్ మాత్రమేనని అన్నారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని మాత్రమే ఈ టెస్ట్ చేశామని పేర్కొంది. అయితే ఈ అలారం మోగిన వెంటనే వినియోగదారులు తొలుత భయపడిపోయారు.