Exit Polls : పంజాబ్ ఆప్ దే

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

Update: 2022-03-07 13:22 GMT

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దాదాపు అన్ని సంస్థలు పంజాబ్ లో ఆప్ కే అవకాశముందని తేల్చాయి.వివిధ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత కనపరుస్తుంది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలుండగా ఆమ్ ఆద్మీ పార్టీ మూడు వంతుల సీట్లు చేజిక్కించుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి.

సర్వే ప్రకారం.....
ఇండియా టుడే సర్వే ప్రకారం పంజాబ్ లో ఉన్న 117 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 76 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ 19 నుంచి 31 స్థానాలకు పరిమితమవుతంది. అకాలీదళ్ 7 నుంచి 11 స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయి. ఇక బీజేపీ ఇక్కడ ఒక స్థానం నుంచి నాలుగు స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. న్యూస్ 18 సంస్థ కూడా ఆప్ కు 60 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.


Tags:    

Similar News