ఫోర్త్ వేవ్ మామూలుగా ఉండదట
భారత్ కు కరోనా ఫోర్త్ వేవ్ తప్పదంటున్నారు నిపుణులు. ఇప్పటికే మూడు వేవ్ లతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు.
భారత్ కు కరోనా ఫోర్త్ వేవ్ తప్పదంటున్నారు నిపుణులు. ఇప్పటికే మూడు వేవ్ లతో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. తాజాగా నాలుగో వేవ్ ఉందన్న నిపుణుల సూచనలు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ లతో దాదాపు 4.30 కోట్ల మంది వైరస్ బారిన పడ్డారు. అయితే వ్యాక్సిన్ రావడంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పుడిప్పుడే భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
అధ్యయనాలలో....
గత రెండేళ్లుగా కరోనా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎందరో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కరోనాతో ఐదు లక్షల మందికి పైగానే మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా నాలుగో వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చైనాలో కేసులు పెరుగుతుండటంతో అక్కడ అనేక నగరాల్లో లాక్ డౌన్ ను విధించారు. అయితే నాలుగో వేవ్ ప్రజలపై విరుచుకుపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 75 శాతం మంది ప్రజలపై దీని ప్రభావం ఉండనుందని చెబుతున్నారు. జులైలో ఫోర్త్ వేవ్ ప్రారంభమవుతుందని ఐఐటీ ఖరగ్‌పూర్ నిపుణులు చెప్పారు.