ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత
తాజాగా మంగళవారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి కూడా మరణించారు. ఇదే రోజు మరో ప్రముఖ బెంగాలీ
కరోనా, లేదా ఇతర అనారోగ్య కారణాలతో ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు చెందిన చాలామంది సెలబ్రిటీలు మరణిస్తున్నారు. 2020, సెప్టెంబర్ 25న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలింది. ఇక ఇటీవలే మరో గాయని లతా మంగేష్కర్ సైతం కన్నుమూశారు. తాజాగా మంగళవారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి కూడా మరణించారు. ఇదే రోజు మరో ప్రముఖ బెంగాలీ గాయని కూడా తుదిశ్వాస విడిచారు. ఇలా వరుసగా సినీ సెలబ్రిటీలు మరణించడం.. సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది.
Also Read : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ప్రముఖ బెంగాలీ గాయని, బంగ బిభూషణ్ అవార్డు గ్రహీత సంధ్యా ముఖర్జీ (91) కన్నుమూశారు. కొంతకాలంతో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. కోల్ కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతరాత్రి 7.30 గంటల సమయంలో సంధ్యా ముఖర్జీ ఆస్పత్రిలోనే కన్నుమూశారు. హిందీ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు ఆలపించిన సంధ్యా ముఖర్జీకి.. కేంద్రం ఇటీవలే పద్మశ్రీని ప్రకటించగా.. ఆమె దానిని తిరస్కరించారు. సంధ్యా ముఖర్జీ మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.