Delhi : 26న జాతీయ రహదారులపై ట్రాక్టర్ మార్చ్.. రైతు సంఘాల నిర్ణయం
శంభు బోర్డర్ లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. 26న జాతీయ రహదారులపై ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నారు
శంభు బోర్డర్ లో రైతుల ఆందోళన కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు రైతులు ఢిల్లీ బోర్డర్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. చలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా పిలుపు నిచ్చారు. అయితే పోలీసులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఒక రైతు మరణించడంతో ఆందోళనకు రెండు రోజుల పాటు విరామం ప్రకటించిన రైతు సంఘాలు ఈరోజు మరోసారి కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి.
తమ డిమాండ్లను...
మధ్యాహ్నం రెండు గంటలకు రైతు సంఘాల నేతలు కూర్చుని భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని తెలిసింది. 26న అన్ని జాతీయ రహదారులలో ట్రాక్టర్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో పాటు దశలవారీ పోరాటాలను కూడా రెడీ చేయనుంది. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష‌్యత్ కార్యాచరణపై ఎలా ఉండనుందన్నది మరికాసేపట్లో తేలనుంది.