నిర్మలమ్మ బడ్జెట్ నిండా ముంచిందే?
గంటన్నర సేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బడ్జెట్ 39.45 లక్షల కోట్ల అంచనాగా రూపొందించారు
గంటన్నర సేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బడ్జెట్ 39.45 లక్షల కోట్ల అంచనాగా రూపొందించారు. తన ప్రసంగంలో పూర్తిగా తాము భవిష్యత్ లో చేయబోయే అంశాలను గురించి నిర్మలా సీతారామన్ ఎక్కువగా ప్రస్తావించారు. కరోనాతో కుదేలైన రంగాలను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. రాష్ట్రాల కోసం లక్ష కోట్ల నిధులను కేటాయించాలని నిర్ణయించారు.
ఏ వర్గానికి?
ఆదాయపు పన్ను శాఖల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో పన్నుల నుంచి కొంత మినహాయింపు ఉంటుందని భావించిన వారికి నిరాశే ఎదురయింది. అసలు పన్నుల మినహాయింపునే నిర్మల సీతారామన్ పట్టించుకోలేదు. 130 కోట్ల మంది ప్రజల్లో వంద కోట్ల మంది ఆశతో ఎదురు చూస్తున్నా కేంద్రం మాత్రం పట్టించుకోలేదు. రైతులు, కార్మికులు, అనుబంధ రంగ కార్మికులను ఈ బడ్జెట్ లో ఏమాత్రం పట్టించుకోలేదు. ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేయకుండా నధుల అనుసంధానం కోసం నలభై వేల కోట్లు ఖర్చు చేస్తామని గొప్పలు చెప్పుకున్నారు. చివరకు అడవులను కూడా ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తామని చెప్పి అందరినీ ఆశ్చర్యపర్చారు. దీంతో నిర్మలమ్మ బడ్జెట్ నిరాశపర్చిందనే చెప్పాలి.