నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్

అంతరిక్షంలోకి తొలి ప్రయివేటు రాకెట్ విజయవంతంగా ముగిసింది.

Update: 2022-11-18 06:40 GMT

అంతరిక్షంలోకి తొలి ప్రయివేటు రాకెట్ విజయవంతంగా ముగిసింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి కొద్దిసేపటి క్రితం చేసినప్రయోగం విజయవంతం అయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ రాకెట్ ను హైదరాబాద్ కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించింది. తొలి సారి ప్రయివేటు రంగానికి చెందిన రాకెట్ ను ఇస్రో ప్రయోగించింది. ఈ ప్రయివేటు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

విజయవంతం కావడంతో...
దేశంలో తొలిసారి ప్రయివేటు రంగంలో రూపొందించిన మొదటి రాకెట్ విక్రమ్ ఎస్ ను విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ ప్రారంభ్ విజయవంతమయిందని ప్రకటించడంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సంతోషం వ్యక్తమయింది. ఈ రాకెట్ బరువు 545 కేజీలు. ఆరు మీటర్ల ఎత్తు ఉంది. ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రయివేటు పరంగా మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లే అనుకోవాలి.


Tags:    

Similar News